ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 7:41 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ఘన నివాళి: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్,అర్జున్ సమాచారం:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆర్థిక వ్యవహారాల్లో అపార అనుభవం కలిగిన స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రజాసేవలు, రాజకీయ జీవితం, పరిపాలనా దక్షతను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. కొణిజేటి రోశయ్య నిరాడంబర జీవనశైలితో, నిజాయితీతో ప్రజలకు సేవలు అందించి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సమర్థంగా నిర్వహించిన ఆయన, ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమం, పరిపాలనలో పారదర్శకతకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. రాజకీయాల్లో విలువలు, క్రమశిక్షణ, నిబద్ధతకు ఆయన నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొని రోశయ్యకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో స్వామి ఆర్డీవోలు షర్మిల, జల కుమారి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీరామ్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్
ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు కన్న కృష్ణ, మునీందర్ ఆర్యవైశ్య సంఘాల నాయకులు పలువురు అధికారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
============================